కలం, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంచలనం రేపిన నిర్ణయం వెలువడింది. మాజీ క్రికెటర్ మంజురుల్ ఇస్లామ్‌పై (Manjurul Islam) అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(BCB) నిషేధం విధించింది. మహిళల జట్టు మాజీ కెప్టెన్ జహానారా ఆలమ్ చేసిన ఫిర్యాదుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం 2022 మహిళల వన్డే వరల్డ్ కప్ సమయంలో ప్రారంభమైంది. ఆ సమయంలో మోంజురుల్ సెలెక్టర్, మేనేజర్‌గా పనిచేశాడు. జహానారా ఆలం అతనిపై అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో బీసీబీ స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. న్యాయమూర్తి తారిక్ ఉల్ హకీమ్ నేతృత్వంలోని కమిటీ నాలుగు ఆరోపణలను పరిశీలించింది. అందులో రెండు ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదు. మిగతా రెండు ఆరోపణల్లో మాత్రం ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది.
అతని ప్రవర్తన వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమని తేల్చింది. జూన్ 30, 2025తో మోంజురుల్ (Manjurul Islam) ఒప్పందం ముగిసినా చర్యలు అవసరమని బీసీబీ భావించింది. షేర్-ఎ-బాంగ్లా స్టేడియంలో జరిగిన సమావేశంలో అతనిపై పూర్తి నిషేధం విధించింది. బీసీబీ పరిధిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. కమిటీ సూచనలపై ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. ఇదే సమావేశంలో మహిళల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్‌ను కూడా ఆమోదించారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ క్రికెట్‌లో బాధ్యత, పారదర్శకతపై చర్చకు దారితీశాయి.
Read Also: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తవడానికి కారణం ఇదే !
Follow Us On: Sharechat


