epaper
Monday, February 23, 2026
epaper

కడప జిల్లాలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ దాడి

కలం, వెబ్ డెస్క్ : కడప (Kadapa) జిల్లా కాశినాయన మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి (Petrol Attack) నిప్పంటించారు. భాదితుడు దిలీప్‌ను వెంటనే స్థానికులు కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. ఈ దారుణ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాదితుడు దిలీప్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సెల్ డెలివరీ విషయంలో ఆమె పేరెంట్స్ తన పై అనుమాన పడ్డారని.. ఆ యువతి బంధువులే తనపై దాడి చేశారని బాధితుడు దిలీప్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>