కలం, స్పోర్ట్స్ బ్యూరో: గ్రూప్ స్టేజీలో వరుస విక్టరీలతో ముందంజలో నిలిచిన టీమిండియా.. సూపర్ 8 తొలిమ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన టీ20లో (T20 World Cup) టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన సఫారీలను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు చేతులెత్తారు. తొలుత వరుసగా మూడు వికెట్లు తీసినప్పటికీ తర్వాత.. భారీగా రన్స్ ఇచ్చుకున్నారు. దీంతో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది.
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సూర్య సేన మొదటి నుంచి తడబడింది. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ 12 బాల్స్‌లో 15 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత దూబే (42) తప్ప మిగిలిన ప్లేయర్లు రాణించలేకపోయారు. 18.5 ఓవర్లలో టీమిండియా 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది.76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అటు శ్రీలంక వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ లో లంక కూడా ఓడిపోయింది. రెండు ఆతిథ్య జట్లు ఇలా సూపర్ 8 తొలి మ్యాచ్ లోనే ఓడిపోవడం.. ఇరు దేశాల్లోని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
స్పోర్ట్స్ స్పెషల్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి

Read Also: యాదాద్రి దర్శనం చాలా కాస్ట్‌లీ గురూ.. ప్యాకేజ్‌ని బట్టి వరాలు
Follow Us On: Instagram


