epaper
Sunday, February 22, 2026
epaper

రాజమండ్రిలో కల్తీపాలు.. పలువురికి పాడైన కిడ్నీలు

కలం, డెస్క్ : రాజమండ్రిలో (Rajahmundry) కల్తీ పాలు సంచలనంగా మారాయి. పట్టణంలోని చౌడేశ్వరి, వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరు చిన్నారులకు కిడ్నీలు పాడైనట్టు తెలుస్తోంది. మూడేళ్ల బాలుడికి డయాలసిస్ చేయాలని డాక్టర్లు తెలిపారు. ఈ రెండు కాలనీల్లో ఒక్కొక్కరుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ రెండు కాలనీల్లో గణేష్ అనే వ్యక్తి కల్తీ పాలు పోశాడని.. అవి తాగడం వల్లే ఈ సమస్య వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>