కలం, వరంగల్ బ్యూరో: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ (SS Thaman) తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధర్మకర్తలతోపాటు, ప్రధాన అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను తమన్ తిలకించారు. అర్చకులు ఆయన కుటుంబానికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు అందించారు. ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కూరి మయూరి రామేశ్వరరావు, అనంతుల శ్రీనివాస్, ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం అమ్మవారిని జబర్దస్త్ రాకింగ్ రాకేశ్ కూడా తన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Read Also: నిన్న స్టూడెంట్.. నేడు స్పీకర్ : కెన్నెడీ స్కూల్ నుంచి సీఎంకు ఆహ్వానం
Follow Us On : WhatsApp


