epaper
Sunday, February 22, 2026
epaper

పీడిత వర్గాల ఆశాజ్యోతి సంత్ సేవాలాల్: మంత్రి కొండా సురేఖ

కలం, వరంగల్ బ్యూరో: పీడిత వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కొనియాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా వరంగల్ (Warangal) 19వ డివిజన్ కాశీబుగ్గలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బంజారాలతో కలిసి నృత్యాలు చేశారు. సేవాలాల్‌కు పూజలు చేసి డోలు వాయించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. మహిళలు, పీడిత వర్గాల సమానత్వం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేసి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.

బంజారా బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నగరంలో బంజారాల కోసం సేవాలాల్ ఆలయ నిర్మాణం‌తో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ, ఓని స్వర్ణలత భాస్కర్, వస్కుల బాబు, బాల్నే సురేష్, చింతాకుల అనిల్ కుమార్, ఆర్డీవో సుమ, ఏసీపీ శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా, బంజారా ప్రతినిధులు మోతీ నాయక్, బాలాజీ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>