epaper
Sunday, February 22, 2026
epaper

ఇండియా ‘చిప్’ లు వాడండి : ప్రధాని నరేంద్ర మోడీ

కలం, డెస్క్ : మేక్ ఇన్ ఇండియాలో సెమీ కండక్టర్ చిప్ లు చాలా ముఖ్యమని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi). ఇండియాలోని టెక్ కంపెనీలు, డేటా సెంటర్లు మన దేశంలో తయారు చేస్తున్న చిప్ లనే వాడాలంటూ పిలుపునిచ్చారు. దాని వల్ల ఇండియా ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ లో ఈ సెమీ కండక్టర్ చిప్ లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ప్రధాని మోడీ (Narendra Modi) చెప్పారు. హెచ్ సీఎల్, గ్రూప్, ఫాక్సాకాన్ కలిపి యూపీలో ఏర్పాటు చేయబోతున్న సెమీ కండక్టర్ చిప్ కంపెనీకి ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇండియా ఏఐ డేటా సెంటర్లకు హబ్ గా మారుతుందని తెలిపారు. కరోనా టైమ్ లో కొంత చిప్ ల కొరత ఏర్పడిందని.. కానీ ఇప్పుడు ఆ సమస్య రావట్లేదని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>