epaper
Sunday, February 22, 2026
epaper

అధికారులకు హరీశ్ రావు వార్నింగ్

కలం, మెదక్ బ్యూరో: పోలీసులకు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)  హెచ్చరికలు జారీ చేశారు. తమ కార్యకర్తల మీద ఇష్టారాజ్యంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. వారి పేర్లు డైరీలో రాసుకుంటున్నామని.. అధికారంలోకి రాగానే అందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. కింది స్థాయి పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు‌పై స్థాయి అధికారుల మౌఖిక ఆదేశాలతో అక్రమ కేసులు పెడితే చట్టం ముందు జవాబుదారీ కావాల్సి వస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కేసులు పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. అన్ని డైరీలో నోట్ చేస్తున్నామని ఎవరిని వదిలిపెట్టబోమని సున్నితంగా హెచ్చరించారు.

ఖాకీ బుక్ అందరికీ సమానం కాదా?

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల్లో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)  పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఖాకీ బుక్ అందరికీ సమానమే అని గొప్పలు చెబుతున్న డీజీపీ ఏం చేస్తున్నారు. ఆ ఖాకీ బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందా? చట్టంపై గౌరవం దెబ్బతినేలా శివధర్ రెడ్డి వ్యవహారం ఉంది. పోలీసుల కాలర్ పట్టుకుని తన్నమన్న బీజేపీ నాయకుడిపై, బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడిపై కేసులు లేవు అరెస్టులు లేవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టన్నారు. కానీ ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కేతనపల్లి, ఆమనగల్ ప్రాంతాల్లో కేసులు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారు. అక్రమ కేసులు, కాంగ్రెస్ గుండాయిజంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే కనిపించడం లేదా?’ అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. హరీశ్‌రావు‌తోపాటు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, పట్లోల్ల శశిధర్ రెడ్డి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>