కలం, మెదక్ బ్యూరో: అద్దె కట్టలేదని బడికి తాళం వేసిన ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లాలో జరిగింది. వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో అద్దె భవనంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల (Primary School) కొనసాగుతోంది. గత నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ బడికి తాళం వేశాడు. దీంతో రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రైమరీ స్కూల్ భవనం శిథిలావస్థకు చేరడంతో, నూతన భవనానికి గవర్నమెంట్ నిధులు మంజూరు చేసింది.
పాత భవనాన్ని కూలగొట్టి ఓ ప్రైవేట్ భవనంలో విద్యార్థులకు చదువు చెబుతున్నారు. అయితే కొత్త బిల్డింగ్ నిర్మించే కాంట్రాక్టర్కు నెలకు రూ. 3000 చొప్పున అద్దె ఇస్తామని ఒప్పుకున్నారు. నాలుగు నెలలగా అద్దె ఇవ్వకపోవడంతో ఆయన బడికి తాళం వేశాడు. ఈ విషయమై చివరకు గ్రామ సర్పంచ్ స్పందించి సమస్యకు చెక్ పెట్టాడు. మళ్లీ అద్దె భవనంలో విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకున్నాడు.


