కలం, డెస్క్ : బీజేపీ వారసత్వం ఉన్న వారే మహాత్మాగాంధీని చంపేశారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గాంధీ 30 ఏళ్ల పాటు బ్రిటీష్ వారిపై పోరాడి స్వాతంత్య్రం సాధిస్తే.. చివరకు సొంత దేశానికి చెందిన బీజేపీ మూలాలు ఉన్న వాళ్లే తూటాలు పేల్చి చంపేశారని సీఎం రేవంత్ వెల్లడించారు. తాజాగా డీసీసీ అధ్యక్షులకు రాజకీయ శిక్షణా తరగతులను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘నెహ్రూ దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎంతో సేవ చేసి ప్రాణాలు అర్పించారు. అంతటి త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేరుగా ప్రధాని కావాలి. కానీ బీజేపీ శక్తులు అడ్డుకున్నాయి. వాటిని పారదోలేందుకు ఆయన ఎంతో కష్టపడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోయినప్పుడే విజయం సాధిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘ఏపీలో వైఎస్ షర్మిల తన తండ్రి పేరు చెప్పుకుని ఎలాంటి పదవులకు అయినా వెళ్లే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాల అధ్యక్షులు కష్టపడాలి. కాంగ్రెస్ లో కష్టానికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. నేను టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా అందరి దగ్గరకు వెళ్లి సహకరించమని కోరా. వారు నాకు సపోర్ట్ చేస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం’ అంటూ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).
Read Also: భర్త అతడి ప్రియుడితో భార్యకు ముప్పు.. ధర్మవరంలో విచిత్ర ఫిర్యాదు
Follow Us On : WhatsApp


