కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. బీజేపీ శ్రేణులకు సంఘీభావంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy), ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా మేడ్చల్ బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రాకేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతోందని విమర్శించారు. త్వరలోనే కామారెడ్డికి (Kamareddy) వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు.
Read Also: చంచల్గూడ జైల్లో ఉగ్రకుట్ర.. డీఐజీ క్లారిటీ
Follow Us On: Sharechat


