కలం, వెబ్ డెస్క్: చంచల్గూడ జైలులో (Chanchalguda Jail) ఉగ్రకుట్ర జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. ఈ వార్తలన్నీ కేవలం వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. బాధ్యతాయుతమైన మీడియా ఛానెళ్లు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ఆందోళనలు సృష్టించవద్దని ఆయన అన్నారు. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన సున్నితమైన విషయాలను ప్రసారం చేసేటప్పుడు మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఐజీ (DIG) సూచించారు. వార్తలను ప్రచురించే లేదా ప్రసారం చేసే ముందు ఒక్కసారి సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. సొసైటీలో అనవసర భయాందోళనలు కల్గించకుండా మీడియా ఛానెళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Read Also: కామారెడ్డిలో హైటెన్షన్.. బీజేపీ నేతల అరెస్ట్
Follow Us On: X(Twitter)


