epaper
Sunday, February 22, 2026
epaper

హైదరాబాద్ కేపీహెచ్‌బీ బస్టాప్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ (Hyderabad)లోని కేపీహెచ్‌బీ(KPHB) కాలనీ బస్టాప్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పద్మావతి ప్లాజాలోని సాయి మొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపు మూసివేసిన సమయంలోనే మంటలు మొదలయ్యాయని సమాచారం. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీప దుకాణాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షాపులోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనితో లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>