కలం, సినిమా : యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Sobhan), క్యూట్ బ్యూటీ మానసా వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “కపుల్ ఫ్రెండ్లీ”(Couple Friendly) మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం డార్లింగ్ ప్రభాస్ (Prabhas) తో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొనింది. మూవీ సక్సెస్ అయినందుకు ప్రభాస్ స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు. అలాగే మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ స్పెషల్ చిట్‌చాట్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannadh)ను ప్రభాస్ ప్రశంసించారు. పూరీ గారిలా ఎవరు డైలాగ్స్ రాయలేరు. బుజ్జిగాడు మూవీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు పిచ్చెక్కిపోయింది. ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో ఎవరితో మాట్లాడిన బుజ్జిగాడిలా మాట్లాడేవాడిని.. అంతలా ఆ క్యారెక్టర్ నాకు తెగ నచ్చేసింది. ఆ రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేయడం ఎవరి వల్ల కాదు. పూరీ గారిలా డిఫరెంట్ గా థింక్ చేసే వ్యక్తి బహుశా ఎక్కడా ఉండరని ప్రభాస్ అన్నారు.


