epaper
Sunday, February 22, 2026
epaper

నారాయణ కాలేజీ హాస్టల్ ఫైట్ వీడియో వైరల్

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో వెలుగుమట్లలోని నారాయణ కార్పొరేట్ కాలేజీ (Narayana Corporate College) హాస్టల్లో విద్యార్థులు గొడవలు పెట్టుకొని తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వారి రూమ్ మేట్ విశాల్ అనే మరో విద్యార్థిపై పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాయపడిన విద్యార్ది ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ కాలేజీ హాస్టల్లో ఇంత రచ్చ జరుగుతుంటే వార్డెన్లు, ఇతర సిబ్బంది ఏం చేస్తున్నారనే అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. గాయపడిన విద్యార్ది తల్లి దండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఇది పిల్లల గొడవ అని తేలికగా తీసి పారేయడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>