కలం, వెబ్ డెస్క్: హోటల్ గదిలోని కాఫీ మేకర్లో ఓ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ (Influencer) తన లోదుస్తులను ఉతికిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. సాధారణంగా కాఫీ తయారు చేసుకోవడానికి ఉపయోగించే పరికరాన్ని బట్టలు ఉతకడానికి వాడటం చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో, ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ముఖ్యంగా హోటల్ (Hotel) గదుల్లోని వస్తువులను ఇతర గెస్టులు కూడా వాడుతుంటారు. కానీ లోదుస్తులను ఉతకడం వల్ల బ్యాక్టీరియా వ్యాపించి ఇతరుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. “ఇలాంటి వారి వల్లే హోటల్ వస్తువులను వాడాలంటే భయం వేస్తోంది” అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా అని మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్ను విమర్శిస్తున్నారు.
ఈ వార్త వెలుగులోకి వచ్చాక, హోటల్ గదుల్లో ఉండే వస్తువుల పరిశుభ్రతపై మళ్ళీ చర్చ మొదలైంది. ముఖ్యంగా కాఫీ మేకర్లు, కెటిల్స్ వీటిని ఇలాంటి పనులకు వాడుతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటివి వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.


