కలం, వెబ్ డెస్క్: శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రసాదంలో కల్తీ నెయ్యి (Adulterated Ghee) వాడారని ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు (Pothugunta Ramesh Naidu) సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు సైతం వైసీపీ హయాంలో తిరమల లడ్డు ప్రసాదంతో పాటు శ్రీశైలం ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు. దీనికి బలం చేకూరుస్తూ రమేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో శ్రీశైలం ఆలయానికి 2023 మే నుంచి కల్తీ నెయ్యి సరఫరా ప్రారంభమైందని వెల్లడించారు. ఇలా 2024 మార్చి వరకు సరఫరా జరిగిందని, దీనిపై సీఎం చంద్రబాబు విచారణ చేయించాలని కోరారు. వాస్తవాలు ప్రజల ముందుంచి కల్తీ నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇక శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.


