కలం, వెబ్ డెస్క్: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సొంత నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతోంది. హిందూపురం (Hindupur)లో బాలకృష్ణ సొంతింటి నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం సతీసమేతంగా భూమి పూజ చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇల్లు కట్టుకుంటున్నట్లు తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బాలకృష్ణ హిందూపురానికి వచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటున్నారు. రేపటితో ఆయన పర్యటన ముగియనుంది.


