కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన పిన్ని, తమ్ముడిపై కత్తితో దాడి (Knife Attack) చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని మార్కండేయ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగగా రామ్ దూత్ అనే వ్యక్తి తన పిన్ని సుమిత్ర, ఆమె కొడుకు ప్రణయ్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కొమురమ్మను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు రామ్దూత్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


