epaper
Sunday, February 22, 2026
epaper

మోసానికి నిలువెత్తు రూపం కడియం శ్రీహరి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

కలం, జనగామ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటే మోసానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Rajeshwar Reddy). మాజీ సీఎం కేసీఆర్ పై కడియం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. కడియం శ్రీహరి రాజకీయంగా సాయం చేసిన సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత కేసీఆర్ ను మోసం చేసి ఇవ్వాళ రేవంత్ రెడ్డి పంచన చేరారని విమర్శించారు. ‘నిన్ను ఎంపీను చేసి, ఎమ్మెల్సీని, మినిస్టర్ ని, ఎమ్మెల్యేని చేసి, నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే.. ఈ రోజు కేసీఆర్ ను తిడుతావా.. నీ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. నీలాంటి ఊసరవెల్లికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారు’ అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>