కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబె (Shivam Dube) అదరగొట్టాడు. బ్యాట్‌తోనే కాదు బాల్‌తోనూ ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో దూబె దూకుడు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయితే, మ్యాచ్ అయిపోయిన తర్వాత తన దూకుడు రహస్యాన్ని దూబె అందరితో పంచుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన దూబె.. ఐపీఎల్ సమయంలో షార్ట్ బాల్స్‌పై ఇబ్బంది పడినట్లు గుర్తుచేశాడు. ఆ సమయంలో బంతిని నీట్‌గా, టైమింగ్‌లో కొట్టలేకపోయానని తెలిపాడు. అయితే, తనలోని శక్తిని ఉపయోగించుకోవాలని ఆఫ్ సీజన్‌లో కష్టపడినట్లు చెప్పాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) తనకు సాయం చేసినట్లు చెప్పాడు. ప్రతి షార్ట్ బాల్‌ను సిక్సర్‌గా కొట్టాల్సిన అవసరం లేదని, బౌండరీ లేదా సింగిల్ తీసుకున్నా సరిపోతుందని సూచించినట్లు వెల్లడించాడు. అదే ఆలోచనతో ఇన్నింగ్స్ ఆరంభిస్తానని పేర్కొన్నాడు.
అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబె (Shivam Dube) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసి మ్యాచ్ తీరును మార్చేశాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. తొలి 11 బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి ఎల్బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్పిన్నర్లపై దాడి ప్రారంభించాడు. బాల్ పేస్ వేరియేషన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ డచ్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. నాలుగు బౌండరీలు, ఆరు సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యాతో కలసి చివరి 10 ఓవర్లలో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఐదు ఓవర్లలోనే భారత్ 75 పరుగులు సాధించింది. 19వ ఓవర్‌లో దూబె ఔటైనా, భారత్ 193/6 స్కోరు చేసింది. నెదర్లాండ్స్ 176/7తో ఆగింది. భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి వరుస విజయాలను కొనసాగించింది. దూబె బౌలింగ్‌లోనూ రాణించి 2/35 గణాంకాలు నమోదు చేశాడు.
Read Also: పాక్ హాకీలో సంచలనం.. ఛైర్మన్ రిజైన్, కెప్టెన్‌పై బ్యాన్
Follow Us On: Pinterest


