కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్దులకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే మరో డీఎస్సీ (DSC) నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. కొన్ని జిల్లాలలో టీచర్ – స్టూడెంట్ రేషియో తక్కువగా ఉండడం వల్ల కొత్త టీచర్ పోస్టుల అవసరం ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి నూతన టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉగాది సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సైతం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. ప్రతీ ఏడాది ఏర్పడిన ఖాళీల మేరకు డీఎస్సీ (DSC) ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు.


