epaper
Sunday, February 22, 2026
epaper

గ‌ద్వాల‌లో ఆర్టీసీ బ‌స్సు బోల్తా

క‌లం, వెబ్ డెస్క్‌: జోగులాంబ గ‌ద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో ఘోర ప్ర‌మాదం (Accident) జ‌రిగింది. ఓ ఆర్టీసీ బ‌స్సు బోల్తాప‌డ‌టంతో ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. జిల్లాలోని ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జ‌రిగింది. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కి చెందిన బ‌స్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో ఉన్న‌ సుమారు 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బస్సు వేగంగా వెళ్తూ రోడ్డు ప‌క్క‌న ఉన్న గుంట‌లో ప‌డింది.

దీంతో పలువురు ప్రయాణికుల కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తలకు తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో గాయాల‌పాలైన వారు భ‌యంతో అరుస్తూ ఏడ్చారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: భార‌త్‌లో ఓపెన్ ఏఐ కొత్త ఆఫీసులు.. ఎక్క‌డంటే..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>