కలం, వరంగల్ బ్యూరో : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితునికి జీవితఖైదు విధించింది మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు. అలాగే, రూ.50వేలు జరిమానా చెల్లించాలని పేర్కొంటూ తీర్పు చెప్పింది. వివరాలివీ.. ఓ బాలికను అత్యాచారం చేసి చంపేసినట్లు 2021లో జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ధర్మసోత్ రాజేష్ (22) అనే యువకుడు బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్లు గుర్తించారు.
దీనికి సంబంధించిన ఆధారాలను శాస్త్రీయంగా, పకడ్బందీగా సేకరించారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. సాక్షాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎండీ అబ్దుల్ రఫీ తీర్పు చెప్పారు.
Read Also: అద్దంలాంటి రోడ్లకే ప్రాధాన్యం.. బడ్జెట్ ప్రపోజల్స్పై కోమటిరెడ్డి రివ్యూ
Follow Us On: Sharechat


