epaper
Monday, March 2, 2026
epaper

యుద్ధం ఎక్కడయినా గెలిచేది భారత్‌యే: లెఫ్టినెంట్ జనరల్

‘రామ్ ప్రభార్’ మిలటరీ విన్యాసాలు భవిష్యత్ యుద్దాలకు సన్నాహాలని పశ్చిమ కమాండ్ జీఓసీ-ఇన్-సీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ అన్నారు. భారత సైన్యం(Indian Army) అన్ని డొమైన్‌లలో యుద్ధానికి సిద్ధమవుతోందన్నారు. రానున్న కాలంలో యుద్ధం ఒక్క డొమైన్‌లో జరగదని, అనేక డొమైన్‌లలో జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే భారత్ రెడీ అవుతోందని వివరించారు. భారత్ను.. సైబర్, రసాయనిక, అణు, బయొలాజికల్ వంటి అన్ని రకాల యుద్ధాలకు సిద్ధం చేస్తున్నామన్నారు. ‘‘రాబోయే యుద్ధం ఒక్క డొమైన్‌కి పరిమితం కానుందనే నమ్మకం లేదు. అది అన్ని డొమైన్‌లలో జరుగుతుంది. కానీ విజయం మాత్రం నేలమీదే సాధించబడుతుంది. 1971 గానీ, 1965 గానీ మన విజయాన్ని పాకిస్తాన్ ఒప్పుకోదు. వాళ్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటేనే మన విజయాన్ని పాక్ అంగీకరిస్తుంది. అందుకే అన్ని డొమైన్‌లు కీలకం’’ అని చెప్పుకొచ్చారు.

Indian Army | ‘రామ్ ప్రభార్’ విన్యాసాలు(Ram Prahar Exercise) పశ్చిమ కమాండ్ కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో ఆపరేషన్లను అమలు చేయడానికి అవసరమైన సామర్థ్యాలను పరీక్షిస్తుంది. ఇందులో ల్యాండ్ దాడుల నుంచి అధునాతన సాంకేతిక ఆధారిత ఆపరేషన్ల వరకు అనేక అంశాలను పరిశీలించారు.

Read Also: కార్మికులకు కేంద్ర గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా నాలుగు చట్టాలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!