epaper
Wednesday, February 18, 2026
epaper

వనస్థలిపురంలో దారుణం.. కత్తులతో పొడిచి మహిళను చంపిన మాజీ భర్త

కలం, వెబ్ డెస్క్: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే అయినవారిని అతి దారుణంగా చంపేస్తున్నారు. విడాకుల తర్వాత మళ్లి పెళ్లి చేసుకుందనే కారణంతో ఓ మాజీ భర్త భార్యను కత్తులతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం (Vanasthalipuram) గ్రీన్ సిటీ కాలనీలో జరిగింది. సునీత (30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణి ఆమె మాజీ భర్త మహేశ్ అతి దారుణంగా చంపేశాడు. పథకం ప్రకారం.. రెండు కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత సునీత ఇంట్లోకి చొరబడిన నిందితుడు, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తులతో పొడవడమే కాకుండా, అక్కడే ఉన్న పూలకుండీతో తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

సునీత గతంలోనే మహేశ్‌కు విడాకులు ఇచ్చి, ఇటీవల రెండో వివాహం చేసుకుంది. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతోనే మహేశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన వనస్థలిపురం (Vanasthalipuram) వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Read Also: కేంద్రానికి తమిళనాడు సీఎం సంచలన డిమాండ్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>