epaper
Wednesday, February 18, 2026
epaper

మదనపల్లె నిందితుడిని వదిలిపెట్టేది లేదు : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : మదనపల్లెలో చిన్నారి రిషిక ప్రియ హత్యాచార కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అటు హోం మినిస్టర్ అనిత కూడా చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని.. పోక్సోకేసు నమోదు చేస్తామని చెప్పారు.

ఏం జరిగిందంటే..?

అన్నమయ్యజిల్లా మదనపల్లిలోని నారుగట్టువారిపల్లిలో గోపీనాథ్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. గోపీనాథ్ కూతురు రిషిక ప్రియ (7) సోమవారం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దీంతో పేరెంట్స్ చుట్టు పక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎదురుగా ఉండే కులవర్ధన్ ఇంట్లో చూడగా.. బాలిక మృతదేహం కనిపించింది. నిందితుడు బాలికను అత్యాచారం చేసి ఆ తర్వాత నీటిలో ముంచి చంపేసినట్టు పోలీసులు నిర్ధారించారు. రాత్రంతా బాలిక మృతదేహం డ్రమ్ములోనే ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులవర్ధన్ ను తమకు అప్పగించాలంటూ బాలిక మృతదేహం పోస్టుమార్టంకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎస్పీ, కలెక్టర్ వచ్చి చెప్పినా వినలేదు. చివరకు హోం మంత్రి అనిత ఫోన్ చేసి నచ్చజెప్పడంతో పోస్టు మార్టంకు తీసుకెళ్లడానికి పేరెంట్స్ ఒప్పుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>