epaper
Wednesday, February 18, 2026
epaper

విజయ్-రష్మిక పెళ్లి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న జంట!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay – Rashmika) ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ వివాహ వేడుకలు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే జరగనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఉండటానికి ‘నో-ఫోన్ పాలసీ’ని అమలు చేస్తున్నారు. అలాగే ఈ వేడుకను కవర్ చేసే టీమ్ కూడా గోప్యత ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సమాచారం.

ఈ పెళ్లికి చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలను ఎవరినీ ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు ఇప్పటికే రష్మిక, విజయ్ (Vijay – Rashmika) నివాసాల్లో వేర్వేరుగా పూర్తయ్యాయి. అలాగే పెళ్లికి ఎలాంటి కానుకలు వద్దని, కేవలం ఆశీస్సులు చాలని అంటోంది ఈ జంట. ఈ మేరకు తమ స్నేహితులకు స్వయంగా రాసిన లేఖల ద్వారా కోరినట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

పెళ్లి తర్వాత విజయ్, రష్మిక సినిమా షూటింగ్స్‌ కు నెల రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. ఈ సమయంలోనూ ఎలాంటి ఫోన్ కాల్స్, మీడియా హడావుడి లేకుండా గడపాలని నిర్ణయించుకున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వెండితెరపై హిట్ జోడీగా నిలిచిన ఈ జంట.. ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అల్లు అర్జున్‌కు క్షమాపణలు చెప్పిన కావేరీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>