కలం, వరంగల్ బ్యూరో : కుమారన్నా.. నీ ఆశయం నెరవేరలేదన్నా అంటూ దివంగత ములుగు (Mulugu) జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమారుస్వామి (Nallela Kumaraswamy) అభిమానులు రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కుమారుస్వామి కోడలు స్వాతి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.
చైర్మన్ పదవి ఆమెకే ఇస్తారని పార్టీ శ్రేణులు భావించారు. కానీ సోమవారం జరిగిన ఎన్నికలో ములుగు పట్టణ అధ్యక్షులు బిక్షపతి సతీమణి చంద్రకళను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి కోడలు స్వాతి, అభిమానులు ఆయన ఇంట్లో ఫోటో ముందు నిల్చొని నీ ఆశయం నెరవేరలేదన్నా టైం వచ్చినప్పుడు వారికి తగిన గుణపాఠం చెబుతామంటూ ఏడుస్తున్న వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది.
Read Also: హంగ్ మున్సిపాలిటీలకు ఇన్ ఛార్జులను నియమించిన కేటీఆర్
Follow Us On : WhatsApp


