Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన ఆభరణాలు చోరీ..

కలం, డెస్క్ : హైదరాబాద్ లో మరో భారీ దొంగతనం బట్టబయలైంది. పంజాగుట్టలోని జోయ్ అలుక్కాస్ (Joyalukkas) లో కోటి రూపాయల విలువైన ఆభరణాలు దొంగతనం జరిగిందని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేనేజ్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఎవరికీ అనుమానం రాకుండా ఈ ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. రోజూ కొన్ని ఆభరణాల చొప్పున మొత్తం కోటి రూపాయల విలువైన సొత్తును తీసుకెళ్లాడని తాము గుర్తించినట్టు యాజమాన్యం తెలిపింది. దొంగతనం చేసిన ఉద్యోగిని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసినట్టు సంస్థ వెల్లడించింది.

Read Also: బీజేపీ నేత వ్యాఖ్యలపై నటి త్రిష రియాక్షన్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>