epaper
Wednesday, February 18, 2026
epaper

జిన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ – బీజేపీ పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. జిన్నారం మున్సిపాలిటీలో (Jinnaram Municipality ) మొత్తం 20 వార్డుల్లో బీఆర్ఎస్ -8, కాంగ్రెస్-6, బీజేపీ-4, ఇండిపెండెంట్-2 విజయం సాధించారు. చైర్మన్ పదవి కోసం మ్యాజిక్ ఫిగర్ 11. ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో బీఆర్ఎస్ – బీజేపీ (BJP) మధ్య సయోధ్య కుదిరి పొత్తు పెట్టుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ నల్తురు జనార్ధన్ చైర్మన్‌గా, బీజేపీ 2వ వార్డు కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకోవడం లాంఛనమే అని తెలుస్తోంది.

Read Also: భువనగిరి, మిర్యాలగూడ చైర్మన్లపై సస్పెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>