కలం, వెబ్ డెస్క్: ఏపీలో జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ (Arava Sridhar) వ్యవహరం మరుకముందే, ఓ టీడీపీ నేత వికృత చేష్టలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం (Hindupur)లో చిలమత్తూరు మండల నేత నాగేంద్ర తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కూలుకు వెళ్లే అమాయకపు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు బాలికలతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా నగ్న వీడియోలు తీసి, ఆ తర్వాత వాటిని చూపించి బెదిరింపులకు పాల్పడుతూ వారిపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు వార్తలు బయటకొచ్చాయి.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. నిందితుడు నాగేంద్ర వీడియో కాల్స్ ద్వారా బాలికలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దృశ్యాలు వెలుగులోకి రావడంతో మండిపడుతున్నాయి. అధికార పార్టీ అండతోనే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: నారాకోడూరులో ‘సమృద్ధి గ్రామ్ ఫిజిటల్’ కేంద్రాలు
Follow Us On : WhatsApp


