epaper
Wednesday, February 18, 2026
epaper

తీర్దాల జాతరలో ట్రాఫిక్ అస్తవ్యస్తం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలం తీర్థాల జాతర (Theerthala Jatara) కు జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినం సందర్భంగా తీర్థాల జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. జనం భారీగా తరలి రావడంతో రోడ్లన్నీ వాహనాలు, జనాలతో కిక్కిరిసి పోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం విఫలం అయ్యారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని ఎండ తీవ్రతకు పలువురు మహిళలు, చిన్నారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పల్లెగూడెం (Pallegudem) నుంచి తీర్దాల జాతర (Theerthala Jatara) వరకు రోడ్డు మధ్యలో 60 ఎంఎం కంకర, గ్రావెల్ మట్టి తోలి ఉంచడంతో వాహనాల రాకపోకలతో పెద్ద ఎత్తున దుమ్ము ధూళి లేచి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని దుస్థితి ఏర్పడింది. పలు ద్విచక్ర వాహనదారులు వారి కుటుంబ సభ్యులతో వెళుతున్న క్రమంలో కంకర రాళ్లు తగిలి పడిపోతున్నారంటే, ఈ రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్రిడ్జి కింద గ్రావెల్‌తో రోడ్డు మార్గాన్ని వన్ వే రూట్ గా తయారు చేసినా కూడా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వాహనదారులను నియంత్రించడంలో పోలీసులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారు. దుమ్ము ధూళి లేవకుండా కనీసం రోడ్డుపైన ట్యాంకర్లతో నీళ్లు చల్లే వారు కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Read Also: దోపిడి అరికట్టడానికే సీపీఐకి మద్దతు ఇస్తామన్నాం : కేటీఆర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>