కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకూలంగా పనిచేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఫలితాలు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాలపై ఆయన స్పందించారు. ఎన్నికలలో పదవులు గెలుపొందడానికి కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోలీస్ శాఖను దగ్గర పెట్టుకుని ఎన్నికలను అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. అయినా మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ 30 శాతం ఓట్లను కొల్లగొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల ఓట్లు వస్తే.. గులాబీ పార్టీకి 10 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మూడు రోజుల ముందే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిందని, కనీసం 15 రోజులన్నా సమయం ఇవ్వాల్సి ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen) అభిప్రాయపడ్డారు.
Read Also: సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram


