కలం, వెబ్ డెస్క్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్ట (Keesaragutta) శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఒక మహిళ మెడలోని 5 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.


