కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడక్కడ చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కన్ని చోట్లా క్యాంపు రాజకీయాలు మొదలైతే.. మరికొన్ని చోట్ల ఓట్ల కోసం పంచిన డబ్బులను వెనక్కి తీసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల (Mancherial) మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతి, ఆయన భార్య రూప ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి నిలదీశారు.
‘మాకు ఓటు వేశామని దేవుడి మీద ఒట్టు వేసి చెప్పండి.. లేదంటే మేం ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయండి’ అంటూ డిమాండ్ చేశారు. ‘మా డబ్బులు తీసుకుని వేరే అభ్యర్థికి ఓటేస్తారా? అంటూ గొడవకు దిగారు. ఎన్నికల సమయంలో తాము భారీగా ఖర్చు చేశామని, ఓటర్లు నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: ఫార్ములా కార్ రేస్ కేసులో కొత్త ట్విస్ట్
Follow Us On: Sharechat


