epaper
Wednesday, February 18, 2026
epaper

అత్తాపూర్​లో దారుణం.. బావను చంపిన బావమరుదులు

కలం, వెబ్​ డెస్క్​ : రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ (Attapur) ​లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ విభేదాల కారణంగా ఓ న్యాయవాదిని దుండగులు విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత్య (Lawyer Murder) చేశారు. సులేమాన్​ నగర్​ లోని తన ఆఫీసులో ఉన్న సమయంలో న్యాయవాది ఖదీర్​ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. కత్తులతో దాడిచేయగా తీవ్ర గాయాలపాలయిన న్యాయవాది అక్కడికక్కడే మృతిచెందాడు. ఖదీర్​ ఊపిరిపోయిందో లేదో అని నిర్దారించుకున్న తరువాతే నిందితులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ విభేదాల కారణంగానే ఖదీర్​ ను తన బావమరుదులే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: సాయం చేయమంటే.. రూ.4.5 లక్షలు దోచేశారు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>