Mobile Popup Ad
Mobile Popup Ad

యాదాద్రి బృందావన్ ల్యాబ్‌లో భారీ పేలుడు.. ఒక్కసారిగా పేలిన రియాక్టర్

కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంలో కార్మికులు భయాందోళన నెలకొంది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దోతిగూడెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దోతిగూడెంలో ఉన్న బృందావన్ ల్యాబ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదం నుంచి కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఒక బ్లాక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>