కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో మొత్తం రెండు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇల్లందులో కాంగ్రెస్(19), బీఆర్ఎస్(3), ఇండిపెండెంట్ (2).. అశ్వారావు పేటలో కాంగ్రెస్(17), బీఆర్ఎస్(2), స్వతంత్రులు ఒకటి, బీజేపీ ఒకటి గెలుచుకున్నాయి. అంటే కొత్తగూడెం జిల్లాలోనీ రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ (Congress) స్పష్టమైన మెజారిటీ సాధించగా, కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ 22 స్థానాలు, కాంగ్రెస్ కు 22 స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్కు 8 స్థానాలు, స్వతంత్రులకు 6 స్థానాలు దక్కాయి. సీపీఏం, బీజేపీలు చేరో స్థానాన్ని దక్కించుకున్నాయి.
ఖమ్మం (Khammam) జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. సత్తుపల్లిలో కాంగ్రెస్ (Congress) 17, బీఆర్ఎస్ 6 సీట్లు గెలుచుకున్నారు. అలాగే ఏదులాపురంలో కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, సీపీఎం 2, సీపీఐ 3, ఇండిపెండెంట్ 1 సీటు గెలిచారు. వైరాలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, సీపీఎం 1, సీపీఐ1, ఇండిపెండెంట్ 1 గెలవగా, కల్లూరులో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఇండిపెండెంట్ 1స్థానంలో గెలిచారు. ఇక మధిరలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 3 స్థానాలు గెలిచారు. ఇక్కడ కూడా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత లభించింది.
Read Also: యాదాద్రి బృందావన్ ల్యాబ్‌లో భారీ పేలుడు.. ఒక్కసారిగా పేలిన రియాక్టర్
Follow Us On: Instagram


