epaper
Wednesday, February 18, 2026
epaper

మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోట అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించినందుకు పట్టణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

నల్లగొండ (Nalgonda) పట్టణ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో నల్గొండను అన్ని రకాల మౌలిక సదుపాయాలతో, సమస్యలు లేని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) వెంకటరెడ్డి అన్నారు.

Read Also: స్పా ముసుగులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో 45 మంది యువతీ యువకులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>