బిల్లు పాసైతే మహిళలదే పైచేయి: అమిత్ షా

కలం, వెబ్ డెస్క్: మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. మహిళల దశాబ్ధాల ఎదురుచూపులకు తెరదించుతూ శుక్రవారం నాడు కేంద్ర కేబినెట్ 132వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిందన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో వారికి 33 శాతం కల్పించే చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. నారీ శక్తి వందన్ చట్టం నిజం కాబోతుందన్నారు. సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే పాలనాపరమైన నిర్ణయాలు, చట్టాల రూపకల్పన, జాతీయ ప్రాధాన్యతల విషయాల్లో వారిదే పైచేయి కాబోతుందన్నారు. అన్ని పార్టీలు పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసే ఈ నిర్ణయాన్ని సమర్థించాలని పిలుపునిచ్చారు.

యూపీకి ఎంతో లాభం..

మోదీ ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 170(1) ప్రకారం అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 500 నుంచి 650కి పెంచుకునే అవకాశం లభించబోతుందని అమిత్ షా తెలిపారు. ‘ఈ సవరణ యూపీలో మరిన్ని సీట్లను పెంచబోతుంది. అలాగే, మహిళల రిజర్వేషన్ల ప్రకారం 33 శాతం సీట్లు వారికి కేటాయించవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో ఎంత మంది ఎక్కువ ఎన్నికైన ప్రతినిధులు ఉంటే.. స్థానిక అవసరాలు, అభివృద్ధికి తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ఈ నిర్ణయం యూపీకి ఎంతో మేలు చేకూర్చనుంది. సుపరిపాలన, ప్రజా ప్రాతినిధ్యం ఒకేసారి సాధ్యమవుతుంది. అందుకే యూపీ పార్టీలు ఈ నిర్ణయాన్ని సమర్థించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>