భర్తతో గొడవ.. ముగ్గురు చిన్నారుల ప్రాణాలు బలి!

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం మూడు పసి ప్రాణాలను బలిగొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేట (Keshampet) మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ, తన ముగ్గురు ఆడపిల్లలను ఇంట్లోని నీటి సంపులో పడేసింది. అనంతరం తాను దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>