కలం, వరంగల్ బ్యూరో : తొలిసారి స్టేషన్ ఘనపూర్ లో (Station Ghanpur) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 18 వార్డులకు 13వార్డులలో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో 70శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో 72శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. ఈ గెలుపుతో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట, కడియం శ్రీహరి (Kadiyam Srihari) వెంటే ఉన్నారనే విషయం స్పష్టం అయిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత ఆరోపణలు చేసినా మున్సిపాలిటీ ప్రజలు ఓటుతోనే తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. రానున్న రెండేళ్లలో 100కోట్లతో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చేస్తానని స్పష్టం చేశారు. అలాగే ప్రతీ వార్డులో అభివృద్ధి పనులకు 2కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: విజయం వారికే అంకితం : మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్
Follow Us On : WhatsApp


