epaper
Wednesday, February 18, 2026
epaper

సీఎం రేవంత్, నాది లక్కీ జోడీ.. మున్సి‘పోల్స్’ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు సానుకూలంగా ఫలితాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం టీపీసీసీ చీఫ్ (TPCC Chief)  మహేష్ కుమార్ గౌడ్ ఫలితాలపై రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మధ్య ఉన్న సమన్వయం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని, తమది ఒక ‘లక్కీ జోడి’ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. గతంలో ఉమ్మడి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఏ విధంగా కలిసి పనిచేశారో, ఇప్పుడు తాము కూడా అదే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేయడం వల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సానుకూల ఫలితాలు వస్తున్నాయని, ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ లబ్ధి కోసం బీజేపీ (BJP) అనుసరిస్తున్న తీరును మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. దేవుడు అందరికీ సమానమేనని, కానీ బీజేపీ మాత్రం ఎన్నికల్లో గెలవడం కోసం దేవుడిని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని మండిపడ్డారు. ప్రస్తుత సమాజానికి కావాల్సింది నిజమైన అభివృద్ధి అని, మతపరమైన భావోద్వేగాలతో ప్రజలను ఎలా వాడుకుంటున్నారో అందరూ గమనించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>