కలం, మెదక్ బ్యూరో: డ్రాలో అదృష్టం వరించి విజయం సాధించిన ఎన్నిక దుబ్బాక (Dubbaka) మున్సిపాలిటీలో జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మూడవ వార్డులో బీఅర్ఎస్ (BRS) అభ్యర్ధి కంకణాల ఎల్లవ్వకు 357, బీజేపీ (BJP) అభ్యర్ధి శ్రీలతకు 357 సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా 357 ఓట్లు రావడంతో అధికారులు రెండుసార్లు రీ కౌంటింగ్ చేశారు. అయినా ఇద్దరికీ ఓట్లు సమానంగా రావడంతో అభ్యర్థుల సమక్షంలో డ్రా తీశారు. ఈ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లవ్వను అదృష్టం వరించి విజయం సాధించారు. ఎంతో ఉత్కంఠ నడుమ జరిగిన లెక్కింపు తరువాత చివరికి డ్రాలో ఎల్లవ్వ విజయం సాధించడంతో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.


