కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో (Medak Municipal Elections) ఒకే ఇంటి నుంచి వేర్వేరు స్థానాల్లో పోటీ చేసిన తల్లీకొడుకులు, భార్యాభర్తలు విజయం సాధించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటిచేసిన భార్యభర్తలు గెలుపుపొందారు. 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గజవాడ లావణ్య 281 ఓట్ల మెజార్టీతో, గజవాడ నాగరాజు 185 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసిన తల్లీకొడుకులు విజయం సాధించారు. ఎన్నికల్లో తల్లీకొడుకులు బట్టి లలిత, ఉదయ్ పోటీ చేశారు. 29వ వార్డు నుంచి పోటీ చేసిన ఉదయ్, 17వ వార్డు నుంచి పోటీ చేసిన లలిత ఘన విజయం సాధించారు. పురపాలక సంఘంలో తల్లీకొడుకులు ఒకేసారి ప్రతినిథ్యం వహించబోతున్నారు.


