కలం, డెస్క్ : గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గాజా శాంతిమండలి’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన దావోస్ సదస్సులో ట్రంప్ దీన్ని ప్రకటించారు. ఈ శాంతిమండలిలో చేరాలంటూ భారత్ (India) కు ఆయన ఆహ్వానం పంపారు. దానిపై తాజాగా భారత్ స్పందించింది. ఈ ఆహ్వానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత (India) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే మద్దుతు తెలిపినట్టు గుర్తు చేశారు రణధీర్. గాజాలో శాంతి నెలకొల్పే కార్యక్రమాలను ప్రధాని స్వాగతిస్తున్నారని రణధీర్ వెల్లడించారు.


