కలం, వెబ్ డెస్క్ : వైసీసీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను పోలీసులు గుంటూరు కోర్టుకు (Guntur Court) తరలించారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయన బెయిల్ రాగా, పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 2023లో అంబటి నిర్వహించిన లక్కీ లాటరీపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇప్పుడు పిటీ వారెంట్ జారీ చేశారు. దీంతో పీటీ వారెంట్ పై విచారించడానికి అంబటిని రాజమండ్రి జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టులో పిటీ వారెంట్ పై అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు.
సీఎం చంద్రబాబుపై అంబటి (Ambati Rambabu) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అంబటిని పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్ తో పాటు మరో పాత కేసులో వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కక్ష్య పూరితంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: సీఎస్‌గా వికాస్‌రాజ్?.. సర్కారు ప్రకటనే తరువాయి
Follow Us On: Sharechat


