epaper
Wednesday, February 18, 2026
epaper

భారత్​ బంద్​.. మద్ధతు తెలిపిన కాంగ్రెస్​

కలం, వెబ్​ డెస్క్​ : దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చిన భారత్​ బంద్ ( Bharat Bandh) కు​ కాంగ్రెస్​ పార్టీ మద్దతు తెలిపింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కాంగ్రెస్​ శ్రేణులకు పిలుపునిస్తూ ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. 29 కార్మిక చట్టాలను 4 లేబర్​ కోడ్లతో భర్తీ చేసి అమలు చేయడానికి నిరసనగా కార్మిక సంఘాలు భారత్​ బంద్​ కు పిలుపునిచ్చాయి. వీటి పది సెంట్రల్​ ట్రేడ్​ యూనియన్లు ఉన్నాయి.

విద్యుత్​ సవరణ బిల్లు, విత్తన బిల్లును వెనక్కి తీసుకోవడంతో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టం బలోపేతం దిశగా లేబర్, రైతు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. వీటితో పాటు భారత్​ – అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఆపాలని కోరుతున్నాయి. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు ఆటో రిక్షా, బస్సు, కారు, లారీ డ్రైవర్లు మద్దతు తెలుపుతూ నిరసనల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>