కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (CONGRESS) కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గొడవ ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కర్ర తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) అడ్డుపడ్డారు. పోలీస్ వాహనంలో నుంచి కర్ర తిరుపతిని బయటకు తీసుకొచ్చి పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు డబ్బులు పంచిపెడుతున్నారని, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.


